Wednesday, May 22, 2024
- Advertisement -

యేడాదిలో నాని సంపాద‌న తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

- Advertisement -

చేసిన ప్రతి సినిమా హిట్ అయితే ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తాయి. ఆఫ‌ర్లు వస్తే.. రెమ్యున‌రేష‌న్ కూడా పెరుగుతుంది. టాలీవుడ్ హీరోలు ఒక్క హిట్ కోసం ప‌రితపించి పోతున్నారు. అలాంటిది నాని మాత్రం ఏకంగా యేడాది గ్యాప్‌లో వరసగా మూడు హిట్లు కొట్టాడు. భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మెన్‌.. ఇలా వ‌రుస‌గా మూడు హిట్లు కొట్టి స్టార్ హీరో అనిపించుకున్నాడు.

వరసగా హిట్స్ రావడంతో నాని రేంజ్, మార్కేట్ కుడా భారీగా పెరిగిపోయాయి. టాలీవుడ్ టాప్ హీరోలు ఏడాదికి ఒకే ఒక్క సినిమా తో స‌రిపెడుతుంటే.. నాని మాత్రం ఒక్క ఏడాదిలో మూడు సినిమాలు విడుదల చేశాడు. గ‌తేడాది సెప్టెంబ‌రు నుంచి ఈ ఏడాది వ‌ర‌కూ.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మెన్ సినిమాలు విడుద‌ల చేశాడు.

మూడు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ ఒక్క ఏడాదికే నాని సంపాదించిన మొత్తం ఎంతో తెలుసా రూ.12కోట్లు! ఇప్పుడు మరో రెండు సినిమాలు లైన్లో పెట్టేశాడు నాని. ప్రస్తుతం మ‌జ్ను చిత్రం సెట్స్ మీద ఉంది. నేను లోక‌ల్ అనే చిత్రం ఇటివలే ప్రారంభం అయ్యింది. సో నాని ఇప్పుడు న‌క్క తోక తొక్కిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. అందుకే మ‌నోడు ప‌ట్టింద‌ల్లా బంగారంగా మారిపోతోంది.

{youtube}v=JE4o64nmdkY{/youtube}

Related

  1. నాని ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల
  2. నాని రేటు ఎంతో తెలుసా?
  3. షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ
  4. నాని కావాలి – తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -