అయ్యర్‌ గాయంపై స్పందించిన ఢిల్లీ జట్టు యజమాని

- Advertisement -

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సమయంలో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ టీమిండియా బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ 14 వ సీజన్‌లో ఆడటం అనుమానంగానే ఉంది. బౌండరీని నిలువరించే క్రమంలో కిందపడ్డ అయ్యర్‌ ఎడమ భుజానికి గాయమైంది. దీంతో అతను మైదానం వీడక తప్పలేదు. అయితే, అయ్యర్‌ గాయానికి సర్జరీ అవసరం కావడంతో దాదాపు 4 నెలలకు పైగానే అతను ఆటకు దూరం కానున్నట్టు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. అదే జరిగితే 2021 ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి అతను దూరం కానున్నాడు.

ఇక తమ కెప్టెన్‌ గాయపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం సైతం ఆందోళనలో మునిగింది. తాజాగా ఢిల్లీ జట్టు సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ అయ్యర్‌ గాయంపై స్పందించాడు. గాయం కారణంగా అయ్యర్‌ ఆటకు దూరం కావడం నిజంగా ఆందోళన కలిగించే అంశమని ట్విటర్‌లో పేర్కొన్నాడు. అయినప్పటికీ అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు అయ్యర్‌ సేవలు అవసరమని పార్థ్‌ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

కోవిడ్ సెకండ్ వేవ్ – మనం తీసుకోవలసిన జాగ్రత్తలు!

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు!

షాకింగ్‌ వీడియో: అవసరాల శ్రీనివాస్‌ అసలు రూపం ఇదేనా..?

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -