Friday, April 26, 2024
- Advertisement -

వకీల్ సాబ్ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాడు..!

- Advertisement -

గత ఏప్రిల్ 9వ తేదీన విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ఘన విజయం సాధించింది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్ల పాటు విరామం తీసుకుని పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. సినిమా బాగుందనే టాక్ రావడంతో పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అంతా భావించారు.

అయితే ఈ సినిమా విడుదలైన వారం, పది రోజులకే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మొదలైంది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూత వేశారు. వకీల్ సాబ్ రైట్స్ పొందిన అమెజాన్ సినిమా విడుదలైన తర్వాత 50 రోజులకు స్ట్రీమింగ్ చేయాల్సి ఉండగా, థియేటర్లు మూతపడడంతో 30 రోజులకే స్ట్రీమింగ్మొదలు పెట్టింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం మెల్ల మెల్లగా తగ్గుతోంది. ఈనెలాఖరుకు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి.

జూలై ద్వితీయార్ధంలో సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో చాలా సినిమాల షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పటికిప్పుడు థియేటర్లకు అనుమతులు వచ్చినా వెంటనే రిలీజ్ చేయడానికి సినిమాలు ఏవీ అందుబాటులో లేవు. ఈ ఈ సిచ్యువేషన్ ను దిల్ రాజు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాను తిరిగి థియేటర్లో విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమాను తెరపైకి చూడలేకపోయామని భావిస్తున్న వారు మళ్ళీ థియేటర్ వెళ్లే అవకాశం ఉంది.

దానికి తోడు ఒక హిట్ అయిన సినిమాను తెరపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. వకీల్ సాబ్ విడుదలకు ముందు ఆ సినిమా నుంచి తొలగించిన కొన్ని సన్నివేశాలను తిరిగి యాడ్ చేసి కొత్తగా విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. కనీసం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 300 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Also Read

లైట్స్.. కెమెరా.. యాక్షన్..!

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

సల్మాన్​ సినిమా ఒక్కరోజు కలెక్షన్​ ఆరువేలు..! ఇది ఘోర అవమానమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -