Wednesday, May 15, 2024
- Advertisement -

అవును నేను పొట్టిగా ఉంటాను అయితే ఏంటి ?

- Advertisement -

ఎక్కడైనా , ఎవరి ముందర అయినా, ఎవరి గురించి అయినా భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేయడం నిత్యామీనన్ కి అలవాటు. రెగ్యులర్ గా ఉండే హీరోయిన్ ఫీచర్ లు ఆమెలో పెద్దగా కనపడవు. ఈ విషయం లో గ్లామర్ లేదు అనీ పొట్టి గా ఉంది అంటూ నిత్య లో టాలెంట్ వదిలేసి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు బోలెడు మంది ఉంటారు .

అయితే ఇలాంటి విమర్శలు తన చెవిన పడుతూనే ఉంటాయి అంటున్నారు నిత్యా మీనన్. తన నటన తప్ప రూపు రేఖల గురించి ఎవరు ఏమన్నా పట్టించుకోను అంటున్నారు ఆమె. ‘ఔను.. నేను పొట్టిగా ఉంటాను. కానీ దాన్ని నేనెప్పుడూ ఓ అనర్హతగా భావించలేదు. పొట్టిగా ఉండటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ మీకేం తెలుసు. నాకో చిన్న కుర్చీ ఇచ్చినా సరే.. అందులోనే పడుకుని నిద్రపోగలను. విమానాల్లో ప్రయాణించేటపుడు కూడా శుభ్రంగా నా సీట్లోనూ ముడ్చుకుని నిద్రపోతా.

దేవుడు మనకిలా ఇచ్చాడు. దానికి మనం ఫీలవడం దేనికి..? ఇక హీరోయిన్ అనగానే మనకిష్టమైన తిండి మానుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది నన్ను బరువు తగ్గమని.. మరిన్ని అవకాశాలు వస్తాయి కదా అని సలహాలిస్తుంటారు. కానీ నేను నేనుగా ఉండాలని కోరుకుంటా. అవకాశాల కోసం నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే నటన అన్నది ముఖ్యమైన విషయం’’ అని చెప్పింది నిత్య. ఈ మాటలు వింటుంటే.. ఎంతైనా నిత్యామీనన్ నిత్యామీననే అనిపిస్తోంది కదా.

Related

  1. నిత్యా మీనన్ ఎన్టీఆర్ ని అంత మాట అనేసిందేంటి?
  2. సమంత అంటే ఎన్టీఆర్ ఎందుకు భయపడుతున్నాడు?
  3. జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!
  4. జనతా గ్యారేజ్ ని వెంటాడుతున్న ప్లాప్ సెంటిమెంట్ !
  5. జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -