Thursday, May 9, 2024
- Advertisement -

హీరో నితిన్ జైల్లో.. ఎందుకంటే..?

- Advertisement -
nitin movie shooting chanchalguda jail

హీరో నితిన్ చంచల్ గూడ జైలు బాట పట్టాడు. తప్పు చేసిన వాల్లే జైలు బాట పడతారు అనుకుంటే పొరపాటే… సినిమా వాళ్లు కూడా షూటింగుల కోసం అప్పుడప్పుడు అలా జైలుకెళ్లొస్తుంటారు. నితిన్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగులో భాగంగానే నితిన్ జైలుకెళ్లాల్సి వచ్చింది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. . ఈ సినిమాలో నితిన్ పాత బస్తీ కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో నితిన్ గత సినిమాలకు భిన్నంగా గడ్డంతో న్యూ లుక్ తో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు లీకైన ఫోటోలకు మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ తో పాటు అమెరికాలో ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు. స్టైలీష్ విలన్ గా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

Related

  1. నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల
  2. నితిన్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే?
  3. నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!
  4. యంగ్ హీరోతో పీక‌ల్లోతు ప్రేమలో మునిగిన ర‌కుల్ ప్రీత్‌..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -