Friday, May 3, 2024
- Advertisement -

శ్రీముఖి కోరికను తీరుస్తున్న కొత్త డైరెక్టర్!

- Advertisement -
bumper offer to anchor sreemukhi

బుల్లితెర‌పై ఇప్ప‌టికే అన‌సూయ, రేష్మీ బాగా పాపులర్ అయ్యి వెండితెర మీద కూడా అదే రెంజ్ లో పాపుల‌ర్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. వీరిలాగే ఇప్పుడు హీరోయిన్ అవకాశం ఎదురు చూస్తోంది అందాల భామ క్రేజీ యాంకర్ శ్రీముఖి. చాలా రోజులుగా హీరోయిన్‌గా మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న శ్రీముఖి కల ఎట్ట‌కేల‌కు ఫలించింది. ఇప్పటికే శ్రీముఖి బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది వెండితెర మీద స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకునేందుకు రెడీ అవుతోంది.

దర్శకుడిగా మారబోతున్న ఒక నటుడు… తన సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు అవకాశం ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల చిన్నది… వెండితెరపై కూడా పలు సినిమాల్లో న‌టించింది. యాక్టర్ గా.. రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్థన్ తెరకెక్కించబోయే చిత్రంలో శ్రీముఖి హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందట. దర్శకుడిగా పరిచయం కాబోతున్న హర్షవర్థన్  ఓ డిఫరెంట్ స్టోరీని తయారు చేసుకున్నాడు.

ఇక తన చిత్రంలో హీరోయిన్ రోల్‌ను శ్రీముఖికి ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంకు టైటిల్ కూడా ఖరారైందని… ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం రిజిష్టర్ చేశారని ప్రచారం జరుగుతోంది. టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగా స్టోరీ కూడా కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంతో శ్రీముఖి కి హీరోయిన్ గా మంచి బ్రేక్ వ‌స్తుంద‌న్న కోరిక‌తో ఉంది. మొత్తానికి శ్రీముఖి కోరిక‌ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తన మొదటి సినిమాతో నెరవేరుతుంది. మరి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మొదటి సినిమా ఏ రెంజ్ లో హీట్ అవుతుందో చూడాలి.

Related

  1. పటాస్ లో రవిపై శ్రీముఖి సీరియస్.. అసలు ఏం జరిగింది..?
  2. యంగ్ హీరో మోజులో శ్రీముఖి.. షాక్ లో రవి!
  3. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!
  4. యాంకర్ శ్రీముఖి ఒక్క షో కి ఎంత తీసుకుంటుందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -