Saturday, April 20, 2024
- Advertisement -

నివేదా పేతురాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -

హీరోయిన్ నివేదా పేతురాజ్.. తన సినీ కెరీర్ సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తొలుత కోలీవుడ్ లో అడుగుపెట్టిన నివేదా.. మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చాలా సినిమాలు చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ సినిమా అల వైకుంఠపురంలోనూ చిన్న పాత్ర చేసింది. గ్లామర్, టాలెంట్ ఉన్నా ఈ అమ్మడుకు పెద్దగా కలిసి రాలేదు.

నివేదా నటించిన చిత్రాలు హిట్ అయినా పెద్ద అవకాశాలు తలుపు తట్టలేదు. మంచి సినిమా చేసి.. తన సత్తా చాటాలని భావిస్తున్న నివేదా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు హీరోయిన్ అనిపించకోవడం కంటే నటి అనిపించుకోవడమే సంతోషమని వ్యాఖ్యానించింది. హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదనే భావనలో చాలా మంది ఉంటారనీ .. కానీ తనకు అలాంటి భయాలు ఏమీలేవంది.

నటన పరంగా తాను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర చేసేందుకైనా సిద్ధమని తెలిపింది. అయితే తనకు అవకాశాలు రానప్పుడు ఉద్యోగం అయినా చేసుకుంటాననీ.. తనకు ఆ సత్తా ఉందని వ్యాఖ్యానించింది. నివేదక వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కన్నడ బ్యూటీకి బాలీవుడ్ ఛాన్స్

సర్కారీ వారి పాటలో మొదట అనుకున్నది ఆ హీరోనే

కొత్త లుక్ లో ఎన్టీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -