Saturday, April 27, 2024
- Advertisement -

కేసీఆర్ మౌనానికి కారణమేంటి ?

- Advertisement -

ఒకవైపు బీజేపీ..మరోవైపు కాంగ్రెస్…అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ ను గద్దె దించుతామన్నారు. అమిత్ షా విమర్శలకు కేటీఆర్ సహా పలువురు మంత్రులు కౌంటర్ ఇచ్చినా.. కేసీఆర్ మాత్రం స్పందించలేదు.

అటు ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంలోనూ టీఆర్ఎస్ నేతలే స్పందించారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితం కావడం.. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలపై స్పందించకపోవడంపై పెద్ద చర్చే జరిగింది. ఏప్రిల్ 29 నుంచి ఫామ్ హౌస్ లోనే ఉంటున్న సీఎం..సోమవారం ప్రగతిభవన్ కు వచ్చారు. రాగానే పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశం నిర్వహించారు.

మరోవైపు వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం.

ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు

ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -