కొత్త లుక్ లో ఎన్టీఆర్

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్… తన తదుపరి మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ ఈ మూవీకి దర్శకుడు. ఎన్టీఆర్ 30 గా పిలుచుకుంటున్న ఈ మూవీని పట్టాలెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య తీసి ప్రేక్షకులను మెప్పించలేకపోయిన కొరటాల శివ.. ఈ సారి ఎలాంటి పొరపాటు జరగకూడదని భావిస్తున్నారు. అందుకే మరింత పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్ జూన్ లో ప్రారంభించాలని భావించినా..తాజాగా రీషెడ్యూల్ చేశారు.

- Advertisement -

దాంతో జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తారక్ 8 నుంచి 9 కేజీలు బరువు తగ్గాడట. దాంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.

సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న యంగ్ హీరో

థాంక్యూ చెప్పబోతున్న నాగచైతన్య

చిక్కుల్లో మోహన్‌లాల్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -