Wednesday, May 7, 2025
- Advertisement -

అమెరికా వెళ్తున్న బిచ్చగాడు!

- Advertisement -

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ సినిమా అయిన రెండు…మూడు వారాలు దాటితే థియేటర్ల నుంచి ఆ సినిమాని తీసేస్తున్నారు. సినిమా హిట్ అయితే కొద్ది రోజులు ఆడుతుంది. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం రెండూ మూడు రోజులకే ఆ సినిమాని తీసేసి వేరే సినిమాని థియేటర్లకి దింపుతున్నారు. ఒకవేళ ఏదైనా సినిమా యాభై రోజులో.. వంద రోజులా ఆడినా.. అది చాలా తక్కువ కేంద్రాల్లో మాత్రమే.

ఇలాంటి రోజుల్లో ఓ తమిళ డబ్బింగ్ సినిమా.. ఓ ఇమేజ్ అంటూ లేని హీరో నటించిన సినిమా జెన్యూన్‌గా చాలా కేంద్రాల్లో వంద రోజులాడింది. ఆ సినిమానే బిచ్చగాడు. 60-70 కేంద్రాల్లో బిచ్చగాడు సినిమా వంద రోజులు పూర్తి చేసుకుందని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం  కొన్ని కేంద్రాల్లో ఆడుతోంది. ఇన్నాళ్లూ తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు అమెరికాకు వెళ్తుండటం విశేషం.

ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి అమెరికాలో ఈ సినిమాని ప్రదర్శించనున్నట్లు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న రెస్పాన్స్ చూసి యుఎస్ తెలుగు ఆడియన్స్ కూడా ‘బిచ్చగాడు’ మీద ఆసక్తి చూపించారు. అందుకే అమెరికాలోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి అమెరికాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related

  1. బిచ్చగాడు ఇప్పుడు బేతాళుడు , విజయ్ యాంటోనీ కొత్త సిన్మా
  2. ‘బిచ్చగాడు’ షాక్ చేస్తున్నాడు!
  3. తగ్గే ప్రసక్తే లేదంటున్న బిచ్చగాడు
  4. బిచ్చగాడు టైటిల్ కి ఇబ్బందులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -