Sunday, May 19, 2024
- Advertisement -

బిచ్చగాడు 2 వచ్చేస్తోంది.. డైరెక్టర్​ ఎవరంటే?

- Advertisement -

విజయ్​ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సూపర్​ హిట్​ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో విజయ్​ ఆంటోని పేరు.. సౌత్ మొత్తం మారుమోగిపోయింది. విజయ్​ గట్స్​ను అంతా మెచ్చుకున్నారు. సాధారణంగా సౌత్​ ఇండియా హీరోలు.. ఇటువంటి పాత్రలు చేసేందుకు ఒప్పుకోవడం ఎంతో అరుదు. అయితే బిచ్చగాడు చిత్రంలో హీరో యాచకుడు. మరోవైపు ఈ సినిమాలో మదర్​ సెంటిమెంట్​ కూడా ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్​ ఆంటోని నటనకు అంతా ఫిదా అయ్యారు.

వెరసి తమిళంతోపాటు తెలుగులో కూడా ఈ చిత్రం హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే బిచ్చగాడు సినిమాకు సీక్వెల్​ తీయబోతున్నారు. సీక్వెల్​కు విజయ్​ ఆంటోని డైరెక్టర్​గా వ్యవహరించబోతున్నట్టు టాక్​. ఈ మేరకు ఇవాళ ప్రముఖ తమిళ దర్శకుడు ఎఆర్​ మురగదాస్​ సోషల్ మీడియా వేదికకగా ఓ పోస్ట్​ పెట్టాడు.

ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 2022లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. విజయ్​ ఆంటోనీ ఒక్క నటుడిగానే కాక.. దర్శకుడు, మాటల రచయిత కూడా. బిచ్చగాడు హిట్​ అయ్యింది. ఇక బిచ్చగాడు 2ను ఎలా తెరకెక్కిస్తారో వేచి చూడాలి.

Also Read

ఆసియా ఖండంలో అందగాడు ఎవరో తెలుసా..?

ప్రభాస్​ -నాగ్​ అశ్విన్​ మూవీ షూటింగ్ షురూ.. !

‘ఇంద్ర’ విడుదలై నేటికి 19 ఏళ్లు.. సినిమా విశేషాలివే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -