Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ సినిమాలో అతిలోక సుందరి!

- Advertisement -
sridevi role in jr ntr movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో 2016ను ఘనంగా ముగించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మూడు వరస సూపర్ హిట్స్ కొట్టడంతో.. తన తదుపరి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నెపథ్యంలోనే తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాలో పాత్రధారుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ రూపర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ నటీమణితో చేయించాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. ఈ పాత్ర కోసం శ్రీదేవిని అడుగుతున్నారనే రూమర్ వినిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు బాబీ ముంబై వెళ్లి ఓసారి శ్రీదేవిని కలిసి ఆ పాత్ర గురించి కూడా చెప్పిన‌ట్టు సమాచారం.

అయితే ఆ రోల్ చేయడానికి శ్రీదేవి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిందా లేదా అనేది.. ఇంకా క్లారిటీ లేదు. శ్రీదేవి రీ ఎంట్రీ తర్వాత దక్షిణాదిలో ఒకే ఒక సినిమా చేసింది. తమిళంలో హీరో విజయ్ పులి చిత్రంలో కీలక పాత్ర చేసినా.. ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో శ్రీదేవి ఎన్టీఆర్‌కు అత్త రోల్ లో నటిస్తుందని తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో శ్రీదేవి నటిస్తే సినిమాపై అంచనాలు పేరగనున్నాయి. 

Related

  1. హీరోయిన్ ని ఏడ్పించిన ఎన్టీఆర్‌!
  2. చరణ్ ని ఘోరంగా అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!
  3. ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది!
  4. రికార్డు సృష్టించబోతున్న ఎన్టీఆర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -