రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో జ‌రుగుతుంది.ఈ సినిమాలో కథానాయికలుగా పూజా హెగ్డే .. ఈషా రెబ్బా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్‌.

ఈ క్రమంలో అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం.ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం వ‌హిస్తున్నారు.