Sunday, May 5, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ లో మరో హీరో!

- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్, యంగ్ హీరో ఉన్ని ముకుంద్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడూ జ‌న‌తాగ్యారేజ్ మరో సీనియ‌ర్ న‌టుడు కూడా కనిపించబోతున్నాడు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోగా రాణించిన సురేష్.. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ సీనియ‌ర్ హీరోకి సంబంధించిన షూట్ ఇప్ప‌టికే కంప్లీట్ అయ్యినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో మరో స్పెషల్ ఉంది అది ఏంటంటే..మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది. ఇలా సినిమా మొత్తం భారీ స్టార్ కాస్టింగ్‌తో నిండిపోనుంది. ఇక దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న గ్యారేజ్ ఆడియో ఆగస్టు రెండో వారంలో రిలీజ్ అవుతుండ‌గా, సినిమా సెప్టెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related

  1. జనతా గ్యారేజ్ లో తమన్నా ఐటెం సాంగ్!
  2. జనతా గ్యారేజ్ సాంగ్ లీక్!
  3. సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ విడుదల
  4. ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -