Sunday, May 5, 2024
- Advertisement -

కబాలి ఎందుకు ప్లాప్ అయ్యిందంటే?

- Advertisement -

నాలుగు రోజులుగా ఎక్కడ చూసిన ఎవరి నోట విన్న కబాలి.. కబాలి అనే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయ్యింది. కబాలిపై అభిమానులు ఎవరికి వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తీరా థియేట‌ర్లోకి వెళ్లీ కబాలి సినిమాని చూస్తే.. ఎన్నో ఆశ‌ల‌ పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.

అయితే క‌బాలి ప్లాప్ కావడానికి కార‌ణాలు చాలనే ఉన్నాయి. ఈ చిత్రం ప్లాప్‍కు ప్ర‌ధాన బాధ్య‌త‌గా ద‌ర్శ‌కుడు రంజిత్‌దే క‌నిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ కథ అంటే ఎన్నో ట్విస్టులుండాలి.. ఆసక్తిగా ఉండే స్క్రీన్ ప్లే ఉండాలి. కానీ కబాలిలో ఇలాంటివేవీ కనిపించవు. మరీ ముఖ్యంగా ఫస్ట్ మొత్తం చాలా ఫ్లాట్ గా కొనసాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో కొంత ఆసక్తి కలిగిస్తుంది. సెకండాఫ్ పెద్దగా ఏం లేదు.

యాక్ష‌న్ సీన్లు, డైలాగులు మాములుగానే ఉన్నాయి. రజనీ స్టైల్ ఒక్కటి అదిరింది అని చెప్పాలి. సూపర్ స్టార్ రజనీ అవకాశం ఇచ్చినప్పుడు దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. కబాలి లాంటి స్టోరీలు గతంలో బోలెడన్ని వచ్చాయి. ఇక ర‌జ‌నీ క్యారెక్ట‌ర్ ఎంత బ‌లంగా ఉండాలి. అలాంటిది ఈ సినిమాలో ర‌జ‌నీ విల‌న్లు త‌రుముతుంటే హోట‌ళ్లో భ‌య‌ప‌డుతూ దాక్కోవ‌డం చూస్తుంటే స‌గ‌టు సినిమా అభిమాని కూడా జీర్ణించుకోలేడు. సో మొత్తానికి భారీ అంచనాలతో వెళ్లిన అభిమానులకు కబాలి నిరాశ మిగిల్చింది.

Related

  1. ‘కబాలి’ రివ్యూ
  2. కబాలి దెబ్బకి అందరూ బాలి
  3. కబాలి కి పోటీగా బాహుబలి రిలీజ్!
  4. కబాలి ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -