Saturday, May 18, 2024
- Advertisement -

‘పైసా వసూల్’ మూవీ రివ్యూ

- Advertisement -

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో 100 సినిమాలు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ‘పైసా వసూల్’ గా పూరీ జగన్నాద్ డైరెక్షన్ లో 101వ సినిమాలో నటించాడు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అండించిన ఈ సినిమాలో శ్రియసరన్, ముస్కన్ సేథి, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
పవర్ ఫుల్ డేరింగ్ యాటిట్యూడ్ తో.. ఎంతటివారినైనా ఎదుర్కునే మనస్తత్వం కలిగినవాడు తేడా సింగ్(బాలకృష్ణ). అయితే తేడా సింగ్ చేసే కొన్ని డేరింగ్ పనుల వల్ల చాలా విషయాల్లో తనకు తెలియకుండా కొందరికి హెల్ప్ అవుతుంటాడు. ఇక అదే టైంలో బాబ్ మార్లో అనే ఇంటర్నేషనల్ డాన్ కు చెక్ పెట్టెందుకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం తేడా సింగ్ కరెక్ట్ అని అతని వాడుకోవాలనుకుంటారు. అయితే మరి తేడా సింగ్ ఆ డాన్ ను పట్టుకునే డీల్ ఒప్పుకున్నాడా..? ఇంతకీ ఈ తేడా సింగ్ కథ ఏంటి..? ఇందులో శ్రియకి-తేడా సింగ్ కి సంబంధం ఏంటి? తేడా సింగ్ ఎందుకలా రెక్లెస్ గా తయారయ్యాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ హీరో బాలకృష్ణ. ఆయన తేడా సింగ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు బాలయ్య చేసిన పాత్రల్లో ఇది చాలా డిఫరెంట్ పాత్ర అని చెప్పాలి. బాలయ్య మాస్ బాడీ లాంగ్వేజ్‌కు పూరీ డైలాగ్స్, యాక్షన్ తోడవ్వడంతో బాలకృష్ణ కొత్తగా కనిపించారు. బాలయ్య డైలాగ్స్ కి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాలయ్య పాడిన ‘మావ ఎక్ పెగ్ లా..’ అనే పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక శ్రియ సరన్ తన పాత్రకు పూర్తిన్యాయం చేసింది. ముస్కన్ సేథి, కైరా దత్‌లు వారి వారి పాత్రలలో పర్వాలేదనిపించారు. ఇక నెగెటివ్ పాత్రలో నటించిన విక్రమ్ జిత్ బాగా చేసారు. అలీ, పృద్వీ పర్వాలేదనిపించారు. ఇక మిగితా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమా సంగతికి వెళ్తే.. ఫస్ట్ ఆఫ్ మొత్తం సరదా సరదా గా, యాక్షన్ ఎపిసోడ్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో వేళ్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కాస్త ఎమోషన్ కూడా బాగుంది. బాలయ్య అభిమానులకు ‘పైసా వసూల్’ బానే ఎంజాయ్ చేస్తారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతలను విషయంలో పూరీ జగన్నాధ్ మెచ్చుకోవాలి. ముఖేష్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి కథతో పూరి జగన్నాథ్ అల్రెడి మూవీ చేసేశాడు. కాబట్టి కథలో పెద్దగా దమ్ములేదని చెప్పాలి. కథనం కొత్తగా కూడా ఏం లేదు. సంగీతం పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగాలేదు.

మొత్తంగా : బాలయ్య ను కొత్తగా.. పూరి మార్క్ డైరెక్షన్.. పంచ్ డైలాగ్స్ ఇష్టపడేవారికి, బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -