Tuesday, May 21, 2024
- Advertisement -

షాకింగ్…. అజ్ఙాతవాసి సినిమాకు సెన్సార్ ఇబ్బందులు….. రాజకీయ కుట్రలపై ఊహాగానాలు

- Advertisement -

అత్తారింటికి దారేది లేకేజీ వ్యవహారం గురించి…… ఆ సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ ఆవేధన చెండం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా సెన్సార్ విషయంలో కూడా ఇబ్బందిపెట్టారని పవనే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు అజ్ఙాతవాసి సినిమాకు కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయా? అజ్ఙాత వాసి సినిమా రిలీజ్‌ని ఆపెయ్యాలని ఎవరైనా కుట్రపన్నుతున్నారా? పవన్ కళ్యాణ్ ఏమేం ఇబ్బందులు పడుతున్నాడు?

ఏంటీ…..ఆవేధన పొంగుకొస్తోందా? అయ్యో పవన్‌కి ఎన్ని కష్టాలు వస్తున్నాయో కదా అనుకుంటున్నారా? పవన్‌కి కావాల్సింది కూడా ఈ సెంటిమెంట్. ఇలా సెంటిమెంట్‌గా ఫీలయ్యే మూఢాబిమానులే. అందుకే అత్తారింటికి దారేది నుంచీ కూడా ఇలాంటి కథలే చెప్తున్నాడు. కానీ కథలే చెప్తాడు. ఆ తర్వాత మాత్రం ఆ కుట్ర ఎవరు పన్నారు? ఎవరు ఇబ్బందిపెట్టారు అంటే మాత్రం సమాధానం ఉండదు. ఎందుకంటే కథలు చెప్పడం ఈజీ….. సెంటిమెంట్ పండించడం కూడా ఒక సినిమా నటుడికి గొప్ప విషయమేం కాదు. కానీ ఆ కుట్ర ఎవరు పన్నారో చెప్పాలంటే మాత్రం నిజాలు కావాలి. సెంటిమెంట్ కోసం వినిపించే సోది కథలకు నిజాలు ఎక్కడ నుంచి వస్తాయి?

అత్తారింటికి దారేది సినిమాను లీక్ చేసింది ఆ సినిమాకు పనిచేసిన ఒక దిగువస్థాయి టెక్నీషియన్ అసిస్టెంట్. కాదని పవన్ చెప్పగలడా? ‘కాన్‌స్పిరసీ’ అంటూ పెద్ద పెద్ద పదాలు మాట్లాడి మూఢాభిమానులను రెచ్చగొట్టి, సెంటిమెంట్ రగిలించిన పవన్….ఇంత వరకూ ఎందుకు ఆ కాన్‌స్పిరసీని బయట పెట్టలేదు? ఎవరు చేశారో ఎందుకు చెప్పట్లేదు? కనీసం పోలీసు కేసులయినా ఎందుకు పెట్టడం లేదు? ప్రస్తుతం చంద్రబాబు పవన్‌కి అత్యంత సన్నిహితుడు. ఇక కెటీఆర్, కెసీఆర్‌లు మెగా ఫ్యామిలీకి ఎంత క్లోజ్‌గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటికి నిన్న రాష్ట్రపతి కార్యక్రమంలో కూడా పవన్‌తో 20 నిమిషాలు మాట్లాడాడు కెసీఆర్. అలాంటి నేపథ్యంలో అత్తారింటికి దారేది కుట్రను చేధించి…….ఆ కుట్ర చేసినవాళ్ళను అరెస్ట్ చేయించడం పవన్‌కి ఎంతసేపు? కానీ చెయ్యలేడు. ఎందుకంటే సొల్లు కథకు సాక్ష్యాలుండవు కదా.

ఇక సర్దార్ గబ్బర్‌సింగ్ సెన్సార్ ఇబ్బందుల కథ అయితే మరీ ఘోరం. ఒక రొటీన్, రొడ్డకొట్టుడు మాస్ మసాలా సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎందుకు వస్తాయి? దూకుడు, గబ్బర్‌సింగ్ లాంటి మాస్ మసాలా సినిమాలకు సెన్సార్ ఇబ్బందులు వచ్చినట్టు ఎప్పుడన్నా విన్నారా? కానీ పవన్ మాత్రం సెంటిమెంట్ కోసం, అభిమానులను మూఢాభిమానులను చేయడం కోసం కథలు చెప్తాడు.

ఇక రాజకీయాల్లో కూడా పవన్ సెంటిమెంట్ పురాణాలు సేం టు సేం. 2014ఎన్నికల సమయంలో బాబుకు, మోడీకి ఓటేయమన్నాడు. అధికారంలోకి వచ్చాక వాళ్ళిద్దరూ పనిచేయకపోతే ప్రశ్నిస్తానన్నాడు. బాబు ఇచ్చిన రుణమాఫీ హామీలు, మోడీ-బాబు కలిసి ఇచ్చిన హోదా, రాజధాని నిర్మాణం, రైల్వేజోన్ హామీలన్నింటికీ మంగళం పాడేశారు పోరాడవయ్యా అని పవన్‌ని అడిగితే నా దగ్గర ఏమైనా ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్నారా అని అడుగుతాడు. నేను బలహీనుడిని అంటాడు. మరి 2014లో ప్రశ్నిస్తా అన్నప్పుడు ఈ జ్ఙానం లేదా పవన్‌కి? సినిమాల్లో ఉండి కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా అన్నీ వదులుకుని రాజకీయాల్లో పోరాటం చేస్తున్నానంటాడు.

ఇలాంటి వంకాయ కబుర్లు పవన్ దగ్గర చాలానే ఉంటాయి. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలను ఎక్కడ వదిలాడు? ఆయన పాటికి ఆయన బ్రహ్మాండంగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. అఫ్కోర్స్…….రాజకయాల్లోకి రాకముందు కంటే ఇప్పుడే కాస్త ఎక్కువ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు పవన్. గత రెండు సంవత్సరాల కాలంలో చరణ్, ఎన్టీఆర్, మహేష్‌లకంటే పవన్ సినిమాల స్పీడే ఎక్కువుందన్నది నిజం. ఇక రాజకీయాల్లో పోరాటం చేస్తున్నానని పవన్ చెప్పడం అంత కామెడీ ఇంకొకటి లేదు. అధికారంలో ఉన్నవాళ్ళపైన చేస్తే పోరాటం అంటారు. కానీ పవన్ మాత్రం ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళపైన చేస్తూ ఉంటాడు వెరైటీగా. చంద్రబాబు, కెసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉంటాడు. మెగా ఫ్యామిలీ మొత్తం ఫాలో అయ్యేది కూడా అదే స్టైల్. చిరంజీవితో సహా అందరూ కూడా అధికారంలో ఉన్నవాళ్ళను పొగడడానికి అవకాశం చూసే బాపతే. సమైక్యాంధ్ర అన్న చిరంజీవి కెసీఆర్‌ని ఏ స్థాయిలో పొగిడాడో చూశారుగా. ఇక పవన్ కథ కూడా సేం టు సేం. రాజకీయాల్లోకి వచ్చి బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఫ్యాన్స్‌కి మాత్రం సెంటిమెంట్ కథలు వినిపిస్తూ పిచ్చోళ్ళను చేస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచీ అయినా సెంటిమెంట్ డ్రామాలకు, మోసాలకు, అబద్ధాలకు వెర్రెత్తిపోయే జనాల్లో మార్పు రావాలని కోరుకుందాం. ఎందుకంటే మోసం చేసేవాళ్ళలో మార్పు రావడం అంత సులభం కాదు. వాళ్ళు పొందే లాభాలు అలా ఉంటాయి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -