Monday, April 29, 2024
- Advertisement -

జియోకి పోటీ ఇచ్చిన ఐడియా.. సూపర్ ఆఫర్ ఇదే!

- Advertisement -
Idea The New Offer

జియోకి గట్టి పోటీ ఇచ్చేందుకు మిగిలిన టెలికం కంపెనీల‌న్ని వరస ఆఫర్స్ తో ముందుకు వస్తున్నాయి. ఈ నెపథ్యంలో టెలికం ఆపరేటర్‌ ఐడియా సెల్యులార్‌ మరో సూపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఐడియా 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లన్నింటికి కూడా ఒకే ధరల్లో డేటా ప్లాన్స్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతుంది.

మార్చి చివ‌రి నుంచి ఈ బంప‌ర్ ఆఫ‌ర్ అందుబాటులోకి రానుంది. 1జీబీ అంత‌కంటే ఎక్కువ డేటా ప్లాన్స్‌ను 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు ఒకే రేటు ఉంటుంది. 1జీబీ నుంచి ఎంత జీబీ వ‌ర‌కు అయినా 2జీ, 3జీ, 4జీ నెట్‌వ‌ర్క్‌ల‌లో ఎన్ని ప్లాన్లు ఉన్నా వాటంత‌ట‌కీ ఒకే రేటు వ‌ర్తిస్తుంది. అంటే డేటా ప్లాన్స్‌ ధరల్లో నెట్‌వర్క్‌ను బట్టి మార్పు ఉండదు. 2017 మార్చి 31 నుంచి దీనిని అమలుచేస్తున్న‌ట్టు ఐడియా ప్రకటించింది. నిజానికి 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు వేర్వేరుగా ఐడియా డేటా ప్లానింగ్స్‌ ధరలు ఉంటాయి.

అయితే, రిలయన్స్‌ జియో అందిస్తున్న 4జీ మొబైల్‌ డేటా సర్వీసు ఐడియా 2జీకి ఇచ్చే ధరకంటే కూడా తక్కువగా ఉంటుంది. ఐడియా 2జీ రేటు కంటే చాలా త‌క్కువ రేటుకే రిల‌య‌న్స్ జియో 4జీ వ‌చ్చేస్తుంది. ఈ క్రమంలో జియో నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తాజాగా తన నిర్ణయాన్ని ఐడియా మార్చుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మిగిలిన టెలికం కంపెనీలు కూడా స‌రికొత్త ఆఫ‌ర్లతో జియోకు పోటీ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి.

{youtube}v=OMlaZiIxtTg{/youtube} 

  1. బీఎస్ఎన్ఎల్ సరి కొత్త సూపర్ ఆఫర్
  2. సూపర్ ఆఫర్ : Redmi 4 స్మార్ట్ ఫోన్ 5000 రూ లకే
  3. జియో వాడేవారికి పేటీఎం సూపర్ ఆఫర్ ఇదే!
  4. జియోకు మరో షాక్.. ఎయిర్‌టెల్ రూ. 150 ప్లాన్‌తో సూపర్ ఆఫర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -