Wednesday, May 8, 2024
- Advertisement -

అఖిల్‌ కి ఏం చేయాలో అర్ధం కాక ఈ పని చేస్తున్నాడు!

- Advertisement -

అక్కినేని అఖిల్ సినిమా వచ్చి ఏడాది గడుస్తోన్నా.. ఇప్పటివరకు తన రెండో సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు అఖిల్. వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అఖిల్ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో తన రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. అయితే తన రెండో సినిమా గురించి ఆలోచించకుండా ఇతర హీరోల సినిమాల గురించి ఆలోచిస్తున్నాడు అఖిల్.

తన సినిమా గురించి ఆలోచించకుండా సుశాంత్‌, నిత్యామీనన్‌ అంటూ వాళ్ల కోసం త్యాగాలు చేస్తున్నాడు అఖిల్‌. సుశాంత్‌ కోసం ఆటాడుకుందాం రా సినిమాలో కొన్ని సెకన్లు తెరపై కనిపించాడు అఖిల్‌. మేన బావ కోసం తన ఇమేజ్‌ ను పణంగా పెట్టాడు అఖిల్‌. ఇప్పుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ కోసం మరో బాధ్యత తీసుకుంటున్నాడు అఖిల్. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ కలిసి నటించిన 100 డేస్‌ ఆఫ్‌ లవ్‌ తెలుగు వర్షన్‌ ఆగస్ట్‌ 26న రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ లో అఖిల్ కూడా పాల్గింటున్నాడు. అది నిత్యామీనన్‌ కోసమా.. లేదంటే దుల్కర్‌ సల్మాన్‌ తో ఉన్న స్నేహమా అనేది తెలియదు గానీ అఖిల్‌ మాత్రం  100 డేస్‌ ఆఫ్‌ లవ్‌ సినిమాకి హెల్ప్ చేస్తున్నాడు. పక్కోళ్ల సినిమాల గురించి ఆలోచిస్తున్న అఖిల్.. తన సినిమా కోసం మాత్రం ఆలోచించడం లేదు. దీంతో అఖిల్ తన సినిమా విషయంలో లేట్ చేయడంతో తని మీద ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.

Related

  1. డైరెక్టర్ చేతిలో అఖిల్ కి ఘోర అవ‌మానం!
  2. అఖిల్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన నితిన్‌!
  3. అఖిల్ ఏం చేస్తున్నాడంటే?
  4. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -