Thursday, April 25, 2024
- Advertisement -

పవన్, క్రిష్ మూవీ లీకెడ్ పిక్.. వైరల్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దూసుకుపోతున్నాడు. పవన్ రీఎంట్రీతో మొదట నటించిన సినిమా “వకీల్ సాబ్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి  అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. ఇందులో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ప‌వ‌న్ వీర‌మ‌ల్లుగా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడ‌ని చెబుతున్నారు.

ఇక  ఈ  సినిమాకు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు కూడా ప్ర‌చారం న‌డుస్తుంది. క్రిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని స్పెషల్ గా వేసిన గండికోట సెట్స్ లో జరుగుతుంది. ఈ మూవీలో క‌థానాయిక‌లుగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ మార్చి 11న విడుద‌ల కానుండ‌గా, ఆ లోపే లీక్ రాయుళ్ళు ప‌వ‌న్ ఫొటోని లీక్ చేశారు.  తాజాగా ఈ మూవీ లోకేషన్ లో పవన్ కళ్యాన్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఈ స్టిల్ లో పవన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ భరిత చిత్రం కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

ఫోటో ఫీచర్ : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?

సిరియాపై అమెరికా వైమానిక దాడి… బైడెన్ తొలి సైనిక చర్య..!

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -