దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

- Advertisement -

దేశవ్యాప్తం కరోనా ఉధృతి మళ్లీ పెరిగింది. టీకా అందుబాటులోకి వచ్చాక.. కొంతమేరా కరోనా తగ్గుముఖం పట్టినా.. మళ్లీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. గత మార్చి నుంచి మొదలైన కరోనా వైరస్ కేసులు లాక్ డౌన్ విధించడంతో కొద్ది మేరకు కంట్రోల్ అయ్యాయి. లాక్ డౌన్ ముగిసిన తర్వాత జనాలు మళ్లీ విచ్చలవిడిగా తిరగడం మొదలు పెట్టారు. కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసులు మళ్లీ పెరగడం మొదలయ్యాయి.

ఈ క్రమంలో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని.. ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

తాజాగా భారతదేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య మొత్తంగా 1,10,63,491కి చేరింది. నిన్న ఒక్కరోజే 120 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 1,55,986 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్య చేసిన బండి!

లక్ష్మణ ఫలం తో చక్కటి ఆరోగ్యం పొందండి!

తగ్గిన పసిడి.. అదే బాటలో వెండి!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -