ఆసక్తి రేపుతున్న రాజేంద్రుడి ‘గాలి సంపత్’ ట్రైలర్ !

- Advertisement -

‘రాజా ది గ్రేట్‌’, ‘ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించిన అనీల్ రావి పూడి ఓ వైపు దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు రచయితగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడి పర్యవేక్షణలో రాబోతున్న చిత్రం  ‘గాలి సంపత్‌’.  శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రయూనిట్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఎమోషన్‌తో పాటు కామెడీ తో ఆసక్తి రేపుతుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికతో సరి చేస్తారు. అందేంటో.. కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోలు ఏం చేసినా ఊరికే చిరాకులు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి.

నేను కూడా మా నాన్నను కాస్త ఓపికగా, ప్రేమగా అడగాల్సింది సార్‌’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుంది.  రాజేంద్ర ప్రసాద్ మూగవాడిగా నటిస్తున్నాడు.. ఆయన నోటి నుంచి గాలి తో ఒక విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. మాటల కంటే గాలే ఎక్కువగా వస్తుంది కాబట్టి అతణ్ని గాలి సంపత్‌ అని పిలుస్తుంటారు. ఇక రాజేంద్రప్రసాద్‌కు హీరో అవ్వాలనే కోరిక ఉంటుంది. కానీ దానికి అతను కొడుకు (శ్రీ విష్ణు) అడ్డు చెబుతుంటాడు.

- Advertisement -

ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మద్య ఏం జరుగుతుంది.. రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు కథ ఎలా ముగుస్తుంది.. అనేది గాలి సంపత్. ట్రైలర్‌ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసిందని చెప్పాలి.నిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న మహాశివరాత్రి సందర్బంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన లవ్‌లీ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

కేసిఆర్ కి షాక్ ఇచ్చిన రఘుమారెడ్డి..!

ఫోటో ఫీచర్ : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -