Saturday, April 20, 2024
- Advertisement -

సిరియాపై అమెరికా వైమానిక దాడి… బైడెన్ తొలి సైనిక చర్య..!

- Advertisement -

సిరియాలోని ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి.  పెద్ద ఎత్తున జరిగిన ఈ దాడుల్లో 17 మంది ఉగ్రవాదులు మృతి చెందారని అమెరికా పేర్కొన్నది. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న ఇరాక్ ఉగ్రవాదుల స్థావరాలు టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు సమాచారం.  సిరియా-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది అమెరికా. 

ఇరాన్ ప్రోద్బలంతో సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపణలు చేస్తున్నది.  అమెరికా అధ్యక్షుడిగా గత నెల 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, ఓ దేశంపై వాయుసేన దాడులు చేయడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. అమెరికా వైమానిక దాడుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని, పలువురికి గాయాలు అయ్యాయని, వారికి చికిత్స జరుగుతోందని ఇరాక్ సైనికాధికారి ఒకరు చెప్పడం గమనార్హం.

ఈ దాడుల్లో సిరియా, ఇరాక్‌ సరిహద్దుల్లో ఉన్న కతాబ్‌ హిజ్బుల్లా గ్రూప్ నకు మారణాయుధాలను సరఫరా చేస్తున్న మూడు లారీలు ధ్వంసమయ్యాయి.  అమెరికన్లకు, సిబ్బంది రక్షణకు ఎలాంటి చర్యలకైనా జో బైడెన్ వెనకాడబోరని ఈ దాడుల ద్వారా స్పష్టం అయ్యింది.

లక్ష్మణ ఫలం తో చక్కటి ఆరోగ్యం పొందండి!

సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్య చేసిన బండి!

తగ్గిన పసిడి.. అదే బాటలో వెండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -