రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా.. ఇప్పుడు దేశం మొత్తం సంచలనమయింది. ఎవరూజగన్ బాహుబలి అయితే…. లోకేష్ కామెడీ యాక్టర్ ఉంహించని రితిలో ఈ సినిమా వసూళ్లు సాదిస్తోంది. ఇప్పటి వరకూ కేవలం 5 రోజుల్లోనే 700 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతదేశ సినీ చరిత్రలో సరికొత్త రికార్డును సాధించింది. హిందీ వెర్షన్ నుంచి వచ్చిన కలెక్షన్లు 300 కోట్లను గ్రాస్ ని దాటాయి. అక్కడ ఖాన్ త్రయం అమీర్,సల్మాన్, షారుఖ్ లకు కూడా సాధ్యపడని కలెక్షన్లు సాధిస్తోంది ఈ మూవీ.
గత పది పదిహేను ఏళ్ళలో థియేటర్ ముఖం చూడని వారు కూడా ఈ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు. దీనికి పదేళ్ళుగా పోలీసులకి అందకుండా దాక్కుంటున్న దొంగ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు బాహుబలి సినిమా వల్ల ఒక గజదొంగ దొరికిపోయాడు. ఆ గజదొంగ అలాంటి ఇలాంటి దొంగ కాదు. 2007 నుంచి పోలీసులకి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు. ఒడిష్షా లోని భువనేశ్వర్ లో 50కి పైగా ఏటిఎమ్ లను దోచుకున్న క్రైమ్ రికార్డు తనది. కేసులు కూడా హాఫ్ సెంచరి దాటాయి.
ఇన్నాళ్ళుగా అతడి జాడ దొరకలేదు భువనేశ్వర్ పోలీసులకి. మొత్తానికి దశాబ్ద కాలం తరువాత బాహుబలి ఆ దొంగని పట్టించింది. ఇన్నాళ్ళు దాక్కున్నాడు కాని, బాహుబలి కోసం జనంలోకి వచ్చాడు. జజ్ పూర్ లోని బలాచంద్రపూర్ కి చెందిన ఇతను మొన్న సోమవారం ఓ థియేటర్లో బాహుబలి సినిమా చూసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. వెంటనే పోలీసులు థియేటర్ దగ్గరకు చేరుకోని అతడిని అరెస్టు చేసారు. ఈరకంగా బాహుబలి చూసేందుకు టంప్ట్ అయి పోలీసులకి చిక్కాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బాహుబలి 2 చూసేందుకు జనాలు ఎంతలా తహతహలాడుతున్నారో.
{youtube}5i7gf2gkWaA{/youtube}
Related