Wednesday, April 24, 2024
- Advertisement -

‘వకీల్‌ సాబ్’కి షాక్ ఇచ్చిన పోలీసులు!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లో 25 మిలియన్‌ వ్యూస్ సాధించగా 1 మిలియన్ లైక్స్‌తో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

తాజాగా ‘‘వకీల్‌ సాబ్’’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ప్రీరిలీజ్ వేడుకల కోసం జే మీడియా ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులను అనుమతి కోరారు.

అయితే కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రీ రిలీజ్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చిచెప్పారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్యం.. ఆ పోలీస్ మృతి..!

సాగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీకి వరుస షాకులు

పంజాబ్​ కింగ్స్​ మొత్తం మారిపోయింది.. అవును ఇది చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -