Saturday, April 20, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి షాకుల మీద షాకులు!

- Advertisement -

దేశంలో అన్ని రాష్ట్రాల్లో కమలం ముద్ర వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ని ఫామ్ లోకి తీసుకు రావడానికి బడా నేతలు పడరాని కష్టాలు పడుతున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫామ్ లోకి వచ్చింది బీజేపీ. కానీ అధికార పార్టీని మాత్రం ఢీ కొట్టలేకపోతుంది. అంతే కాదు ప్రస్తుతం సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కడారి అంజయ్య యాదవ్ నిన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మరోవైపు బీజేపీ నేత కంకణాల నివేదితారెడ్డి బీజేపీ రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆమెతో టీఆర్ఎస్ అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపిలో బీజేపీకి పెద్ద దెబ్బే పడింది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ ముఖ్య నాయకులు వారి అనుచరులు దాదాపు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో శ్రీకాళహస్తీశ్వర నియోజకవర్గ కోకన్వీనర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ మరియు మాజీ కౌన్సిలర్ ఆర్కార్డ్ ముత్తు, ఏర్పేడు మండలం బీజేపీ అధ్యక్షుడు గాండ్ల శివకుమార్,ఏర్పేడు మండలం బీజేపీ జనరల్ సెక్రెటరీ రావెళ్ల హేమంత్ నాయుడు, శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన బీజేపీ రాష్ట్ర మహిళా మోక్ష , మాజీ కౌన్సిలర్ గల్లా పుష్ప, మాజీ కౌన్సిలర్ రామచంద్రయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 ఉన్నారు.

వీరంతా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి , ఉపముఖ్య మంత్రి నారాయణ స్వామి , పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి , ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినవారిలో గణేష్ ,మురళి యాదవ్ ,పాడి చంద్ర, సుబ్రహ్మణ్యం, హేమంత్, కార్తీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

‘వకీల్‌ సాబ్’కి షాక్ ఇచ్చిన పోలీసులు!

మరో ముగ్గురు బలి… మాస్క్ పని ఎక్కడ బాబు..!

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్యం.. ఆ పోలీస్ మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -