Saturday, May 4, 2024
- Advertisement -

లోకేశ్ “యువగళం” .. పార్టీ దశ మారుస్తుందా ?

- Advertisement -

2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై లాంటివి. గత ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఏపీలో టీడీపీ ఏ స్థాయిలో బలహీన పడిందో అందరికీ అర్థమైంది. పార్టీ స్థాపించినది మొదలుకొని అలాంటి ఓటమి ఎప్పుడు చూడలేదు తెలుగుదేశం పార్టీ. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికి.. ఆ ఓటమితో టీడీపీ శ్రేణులు మాత్రం పూర్తిగా డీలా పడ్డారు. పార్టీలో నాయకత్వ లోపం లోపించిందని, సొంత పార్టీ పైనే తెలుగుతమ్ముళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. .

అందుకు తగ్గట్టుగానే గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు… ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో చంద్రబాబు నిమగ్నం అయ్యారు. ” ఇదేం కర్మ రాష్ట్రాన్నికి, బాదుడే బాదుడు,.. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు టీడీపీ అధినేత. అంతే కాకుండా ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. ఇక ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు చంద్రబాబు.. ఇక తనయుడి విషయానికొస్తే.. లోకేశ్ కూడా వచ్చే ఎన్నికల్లో విజయంపై గట్టిగానే గురి పెట్టారు.

గతంలో లోకేశ్ పదునైన వ్యాఖ్యలు చేయడంలో ఇబ్బంది పడేవారు. దాంతో ఆయన రాజకీయాలకు పనికి రాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ విమర్శలన్నిటిని దాటుకొని ప్రస్తుతం లోకేశ్ ఘాటైన వ్యాఖ్యలతో చురుకుగా కదులుతున్నారు. ఇక ప్రజలకు మరింత చేరువైయ్యేందుకు త్వరలో పాదయాత్ర కూడా చేపట్టబోతున్నారు. యువ గళం అనే పేరుతో చేపట్టబోతున్న ఈ పాదయాత్ర జనవరి 27 నుంచి కుప్పంలో ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇక ఈ పాదయాత్రపై టీడీపీ శ్రేణులు గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేపట్టి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. అదే విధంగా ఇప్పుడు లోకేశ్ కూడా తన పాదయాత్రతో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు టీడీపీ శ్రేణులు. మరి లోకేశ్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఏపీలో బిజేపీ యాక్షన్ ప్లాన్.. షురూ ?

పవన్ చూపు అటువైపే.. హింట్ ఇచ్చాడా ?

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -