మరో ప్రయోగానికి సిద్దమైన రామ్ చరణ్ !

Ram Charan to play a Stuttering character in RC15
Ram Charan to play a Stuttering character in RC15

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని తెలుగు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక డైరెక్టర్ శంకర్ కు నేషనల్ వైడ్ గా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ తో రాంచరణ్ క్రేజ్ కూడా పాన్ ఇండియా స్థాయిలో విస్తరించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ” RC15 ” పై భారీ అంచనాలే నెలకొన్నాయి. .

అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ శంకర్. ఈ మూవీకి సంబంధించి లీకైనా ఫిక్స్, వీడియో క్లిప్స్ మూవీపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీలో చరణ్ ను రెండు విభిన్న పాత్రలలో చూపించబోతున్నాడట శంకర్. ఒకటి 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్ర కాగా మరోటి కొడుకు పాత్ర.. అయితే ఇంకో పాత్ర కూడా ఉందని ఆ పాత్రలో చరణ్ విలన్ రోల్ లో కనిపిస్తాడనే గుసగుసలు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంచితే ఈ మూవీకి సంబంధించి మరో వార్తా ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వ ఐరల్ అవుతోంది. అదేమిటంటే తండ్రి వయసున్న పాత్రకు నత్తి ఉంటుందట. ఆ పాత్రను శంకర్ ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. మూవీ సెకండ్ ఆఫ్ లో వచ్చే ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. దాంతో నత్తి పాత్ర చరణ్ ఎలా నటించారోనని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. గతంలో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ” రంగస్థలం ” మూవీ లో చరణ్ చెవిటివాడిగా నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దాంతో ఇప్పుడు మరో ప్రయోగం చేస్తూ నత్తి క్యారెక్టర్ లో నటిస్తుండడంతో ఈ మూవీ కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేస్తారని సమాచారం.

ఇవి కూడా చదవండి

అఖిల్ ఏజెంట్ మూవీ ఆ రేంజ్ లో ఉంటుందా ?

వారసుడు మహేశ్ కథే !

ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ ?