Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రభాస్ పాత సినిమాలకు కొత్త ఊపు వచ్చింది!

- Advertisement -

‘బాహుబలి’ పుణ్యమా అని ప్రభాస్ పాత సినిమాలకు కొత్త ఊపు వచ్చింది. ఆ సినిమాలు ఇప్పుడు వరసగా పరాయి భాషల్లోకి డబ్ అవుతున్నాయి.

తెలుగులో ఆ సినిమాలు హిట్ , ప్లాప్ తో నిమిత్తం లేకుండా అవన్నీ వరసగా హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆ సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్లకు కొత్త పండగ వచ్చింది.

సాధారణంగా ఒక సినిమాతో బాగా గుర్తింపు సంపాదించుకొన్న హీరోల సినిమాలన్నింటికీ ఇలాంటి గిరాకీ ఉంటుంది. గతంలో అపరిచితుడు సినిమా హిట్ అయినప్పుడు విక్రమ్ తమిళ సినిమాలు అన్నీ తెలుగులోకి డబ్ అయ్యాయి. అలాగే గజిని  హిట్ అయ్యాకా సూర్య తమిళ సినిమాలు అన్నీ తెలుగులోకి వచ్చేశాయి. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. బాహుబలి సినిమా తమిళ; హిందీ, మలయాళ భాషల్లో హిట్ కావడంతో.. ఆ భాషల నిర్మాతలు ప్రభాస్ సినిమాలను డబ్ చేసుకోవడం మొదలు పెట్టాడు.

బాహుబలి హీరో ప్రభాస్ నటించిన సినిమా అంటూ వీటిని మార్కెట్ చేసుకొంటున్నారు. మరి ప్రభాస్ పాత సినిమాల డబ్బింగ్ వెర్షన్లకు ఆయా భాషల్లో ఎలాంటి మార్కెట్ ఉంటుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -