Saturday, April 27, 2024
- Advertisement -

రాజ్​ అండ్​ డీకే వెబ్​ సీరిస్​లో రాశీ ఖన్నా ..!

- Advertisement -

అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్​ వెబ్​ సీరిస్​ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. సీజన్​ 1 ఓ రేంజ్​లో ఆకట్టుకుంటే సీజన్​ 2 అంతకు మించి దూసుకుపోయింది. ఇక సీజన్​ 2లో రాజీ అనే తీవ్రవాది పాత్రలో నటించిన సమంత నటనకు అంతా ఫిదా అయిపోయారు. సామ్​లో ఈ యాంగిల్​ కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం డిజిటల్​ ప్రేక్షకులు ఫ్యామిలీ మ్యాన్​ సీజన్​ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరిస్​ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్​ అండ్​ డీకే తెలుగు వారు అన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ దర్శకద్వయం ప్రస్తుతం మరో ప్రతిష్ఠాత్మక వెబ్​ సిరిస్​ను తెరకెక్కించబోతున్నదట. ఈ ఆసక్తికరమైన సబ్జెక్ట్​ను ఇప్పటికే సిద్ధం చేశారట. ఈ సీరిస్​లో షాహిద్​ కపూర్​ కీలక పాత్రలో నటించబోతున్నాడట. ఆయనతో పాటు నటి రాశీ ఖన్నాకు కూడా చాన్స్​ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాశీ ఖన్నాకు పెద్దగా హిట్​లు లేవు. దీంతో ఆమె ఓటీటీ లో చేసేందుకు ఓకే చెప్పింది.

అయితే ఫ్యామిలీ మ్యాన్​ 2లో చేసిన సమంతకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ సీరిస్​లో చేసేందుకు రాశీ ఖన్నా ముందుకు వచ్చిందట. సస్పెన్స్​ థ్రిల్లర్​గా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు టాక్​. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానున్నది.

Also Read

గర్జించిన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్..!

చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

నవీన్​ పొలిశెట్టితో మూవీకి నో చెప్పిన స్వీటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -