Thursday, April 25, 2024
- Advertisement -

ఆక్సిజన్​ బాటిల్స్​ వచ్చేశాయి.. జేబులో పెట్టుకోవచ్చు

- Advertisement -

కరోనా సెకండ్​ వేవ్​ టైంలో ఆక్సిజన్​కు ఎంత డిమాండ్​ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమయానికి ఆక్సిజన్​ అందక ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. మన దేశంలో కరోనా సెకండ్​వేవ్​ తీవ్రతతో చాలా మందికి ఆక్సిజన్​ అవసరం అయ్యింది. త్వరలో థర్డ్​వేవ్​ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సెకండ్​వేవ్​ను దృష్టిలో ఉంచుకొని .. ప్రభుత్వాలు ఏ మేరకు ఏర్పాట్లు చేశాయో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ఐఐటీ కాన్పూర్​ పూర్వ విద్యార్థి ఒకరు ఆక్సిజన్​ బాటిల్​ను రూపొందించారు. దీనిని పాకెట్​ లో కూడా పెట్టుకోవచ్చని ఆయన చెబుతున్నారు. డాక్టర్​ సందీప్​ పాటిల్​ ఈ ఆక్సిజన్​ బాటిల్​ను రూపొందించారు. దీని ధరను రూ. 499 గా నిర్ధారించారు. కరోనా టైంలో చాలా మంది ఆక్సిజన్​ సిలిండర్లు మోసుకొని ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లారు. వాటిని తీసుకెళ్లడం చాలా కష్టం. దీంతో డాక్టర్​ సందీప్​ పాటిల్​ ఈ ప్రయత్నం చేశారట.

ఈ బాటిల్​ను మాములూ శానిటైజర్​ బాటిల్ లాగానే జేబులో పెట్టుకొని వెళ్లొచ్చని ఆయన చెబుతున్నారు. అత్యవసర సమయంలో రోగిని ఆస్పత్రి వరకు తీసుకెళ్లేందుకు ఈ ఆక్సిజన్​ బాటిల్​ ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు. ఈ స్పిన్​ టెక్నాలజీ ఆధారంగా ఈ ఆక్సిజన్​ బాటిల్​ను తయారుచేసినట్టు ఆయన అన్నాడు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్​లోకి అందుబాటులోకి రాలేదు. వచ్చాక దీని పనితీరు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఇదో గొప్ప ప్రయత్నం అని మెచ్చుకుంటున్నారు నిపుణులు.

Also Read

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -