Thursday, March 28, 2024
- Advertisement -

చూడ్డానికే భయంకరంగా.. దుర్గ ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్..!

- Advertisement -

లారెన్స్.. సినిమా పరంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. ముందుగా సైడ్ డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ గా ఎదిగి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాకు మ్యూజిక్ కూడా అందించాడు. తనే దర్శకత్వం వహిస్తూ హీరోగా లారెన్స్ చేసిన పలు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా లారెన్స్ హర్రర్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ గా పేరుతెచ్చుకున్నాడు. ఎంత హర్రర్ స్టోరీ అయినా కామెడీ గా తీయడం లారెన్స్ కే చెల్లింది.

లారెన్స్ చేసిన ముని, కాంచన, గంగ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం లారెన్స్ అధిగారం, రుద్రన్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తి కాకుండానే మరో కొత్త సినిమాకు కూడా లారెన్స్ ప్రారంభించాడు. ఆ సినిమాకు దుర్గ అనే పేరు పెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అఘోర, క్షుద్ర మాంత్రిక తరహా పాత్రలో లారెన్స్ భయంకరం గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను స్వీయదర్శకత్వంలో లారెన్స్ నిర్మిస్తున్నాడు. అధిగారం, రుద్రన్ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

Also Read

తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా నటిస్తున్నా : రష్మిక

పాన్ ఇండియా మూవీలో మరో మెగా హీరో.. ఎవరంటే..!

నితిన్ కొత్త మూవీ షూటింగ్ మొదలవకముందే లాభాల్లోకి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -