తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా నటిస్తున్నా : రష్మిక

- Advertisement -

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భామ రష్మిక మందన్న. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి ఆమె నటించిన గీత గోవిందం సినిమా బంపర్ హిట్ అయ్యింది. అతి తక్కువ సినిమాలతోనే రష్మిక టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తున్న రష్మిక పలు కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోంది.

ప్రస్తుతం రష్మిక హైదరాబాద్లో ఉంటూ ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…’కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నేనిలా వరుసగా సినిమాలు చేయడం అమ్మానాన్నలకు ఇష్టం లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉండాలని వారు నాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులుగా వారికి నా పై ఉన్న ప్రేమకు సంతోషంగా ఉంది. కానీ ముందే ఒప్పుకున్న సినిమాల షూటింగ్ వాయిదా వేయడం అనేది నా చేతిలో ఏమీ లేదు.

- Advertisement -

అందుకే ఒప్పుకున్న సినిమాలు అన్నింటిని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులో పాల్గొంటున్నట్లు’ రష్మిక ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం రష్మిక పుష్పలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్ ఇంకా చాలా జరగాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -