బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి ఆ రెండు సినిమాలే అడ్డు..!

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులో చేసిన తక్కువ సినిమాలతోనే టాప్ హీరోగా ఎదిగాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళ, కర్ణాటకలో కూడా తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఇదే ఊపులో పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అయితే అల్లుఅర్జున్ ఉత్సాహానికి రెండు సినిమాలు బ్రేకులు వేసేలా ఉన్నాయి.

పుష్పను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాను ఉత్తరాదిలో భారీగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప విడుదలవుతున్న క్రిస్మస్ పండగకి అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా విడుదల అవుతోంది. ఈ సినిమాలో తెలుగు హీరో నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అమీర్ ఖాన్ సినిమాకు పోటీగా పుష్ప విడుదల చేయడం వల్ల పుష్ప సినిమా కలెక్షన్ల పరంగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే కన్నడలో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా దేశంలోని అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా కూడా క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదే జరిగితే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కి పెద్ద దెబ్బే.

ఎందుకంటే కేజీఎఫ్ సినిమా ఉత్తరాదిలో కూడా భారీగా హిట్టయింది. అలాగే తెలుగు సినిమాలకు కన్నడలో కూడా మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. కన్నడలో పుష్ప, కేజీఎఫ్ సినిమా ఒకే రోజు విడుదల అయితే కేజీఎఫ్ సినిమా కే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. లాల్ సింగ్ చద్దా, కేజీఎఫ్ విడుదల రోజే పుష్ప విడుదల కావడం వల్ల నష్టాలు తప్పవని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Also Read

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమా..!

2022.. ప్రభాస్​ నామ సంవత్సరం అవబోతుందా?

తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -