Saturday, May 18, 2024
- Advertisement -

కిట్టు ఉన్నాడు జాగ్రత్త ట్రైలర్ రివ్యూ!

- Advertisement -
kittugadu unnadu jagratha trailer

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్.. తర్వాత వరసగా హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత ఓ ప్లాప్ వచ్చిన.. మంచు విష్ణుతో కలిసి ఈడోరకం ఆడోరకం సినిమాతో మళ్లీ హిట్ కొట్టాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ ఓ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగాఅ.. ఇప్పుడీ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో రాజ్ తరుణ్ కుక్కల కిడ్నాపింగ్ కనిపించనున్నాడు.

కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బులడుగుతావా సిగ్గులేదూ.. అని ఓ కేరక్టర్ అడిగితే.. ‘మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కల్ని డబ్బులు అడగలేం కదండీ’ అంటూ వేసిన పంచ్ తోనే.. ఈ సినిమా కాన్సెప్ట్ తెలుస్తోంది. ఇక కౌబాయ్ టైపులో.. భౌ బాయ్ అనే పద ప్రయోగం కూడా బాగుంది. ఇదో లవ్ స్టోరీ అన్న మాట అని రాజా రవీంద్రతో చెప్పించి.. హీరోయిన్ ని పరిచయం చేసిన విధానం కూడా బాగుంది. రఘుబాబును స్వామీజీగా చూపించి.. ‘అప్పుడెప్పుడో సినిమా స్టార్టింగ్ లో కనిపించాడు విలన్.. మళ్లీ పిలిపించండి’ అంటూ విలన్ రోల్ చేసిన అర్బాజ్ ఖాన్ ను తీసుకొచ్చారు.

అక్కడి నుంచి ఓ సేఫ్ ని కిడ్నాప్ చేయడం.. ఫైట్స్.. ఛేజింగ్.. హంగామాతో ట్రైలర్ నడిపారు. ఇక మధ్యలో రాజ్ తరుణ్.. అను ఇమాన్యుయేల్ ల లిప్ లాక్ చూపించి రోమాంటిక్ జోనర్ ని కూడా అదిరిపోయే రెంజ్ లో ఉందని తెలిపాడు. అలాగే హంసానందిని ఐటెంసాంగ్ తో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కిట్టు మళ్లీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

{youtube}7uIs4aoxInE{/youtube}

Related

  1. షాకింగ్ : రాజ్‌త‌రుణ్ తో హెబా ప‌టేల్‌ పెళ్లి
  2. రాజ్ తరుణ్ తో నాకు ఓకే అంటున్న కుమారి
  3. పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ తరుణ్
  4. రాజ్ తరుణ, లాస్య సీక్రేట్ పెళ్లి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -