Thursday, April 25, 2024
- Advertisement -

రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ పోస్టర్ రిలీజ్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు అతి కొద్ది మందే అని చెప్పొచ్చు. అలాంటి వారిలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తర్వాత కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. గత యేడాది రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా ఓటీటీలో విడుదల కాగా, ఈ యేడాది ప్రారంభంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కానీ ఇక్కడ పెద్దంత సందడి చేయలేదు.

అలానే మార్చిలో ‘పవర్ ప్లే’ పేరుతో ఈ యంగ్ హీరో ఓ థ్రిల్లర్ జానర్ మూవీ చేశాడు.. కానీ ఆ మూవీ కూడా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘కూర్చుంది చాలు’ అనేది దీని ట్యాగ్ లైన్. ఈ రోజు రాజ్ తరుణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ‘స్టాండప్ రాహుల్’ చిత్రబృందం తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బినేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా అయిన రాజ్ తరుణ్ కి మంచి పేరు తెస్తుందో లేదో చూడాలి.

తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్..

ఆ కోరిక తీరకుండానే చనిపోయిన TNR.. చివరి వరకు అదే ధ్యాసలో?

మన్యంలో క‌రోనా కలకలం.. 10 మంది మావోయిస్టులు మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -