Thursday, April 25, 2024
- Advertisement -

ఆ కోరిక తీరకుండానే చనిపోయిన TNR.. చివరి వరకు అదే ధ్యాసలో?

- Advertisement -

యాంకర్ గా, నటుడిగా, డిజిటల్ మీడియా కంటెంట్ రైటర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న TNR కరోనా కాటుకు బలయ్యారు. అతని మరణ వార్త తన సన్నిహితులు, అతనితో పరిచయం ఉన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చిన తుమ్మల నరసింహా రెడ్డి అనే ఈయన తెలుగు ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు చూపించారు.

ముఖ్యంగా డిజిటల్ మీడియాలో నరసింహారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇతని ఇంటర్వ్యూలకు వెళ్ళడం అంటే సెలబ్రెటీలు సైతం ఎంతో గౌరవంగా భావించేవారు.అతనితో ఇంటర్వ్యూ చేస్తే చాలు ప్రపంచం మొత్తం తమకు గుర్తింపు వస్తుందని ఎంతోమంది భావిస్తుంటారు. ఈయన యాంకర్ కాకముందు న్యూస్ ఛానెల్స్‌లో రిపోర్టర్‌గానే కాకుండా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గానూ వర్క్ చేశారు.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

TNR ఇండస్ట్రీలోకి వచ్చిందే ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకోవాలని. యాంకర్ గా, రైటర్ గా, ఎంతో గుర్తింపు సంపాదించుకున్న TNR కి ఎప్పటికైనా వెండితెరపై తన పేరు దర్శకుడిగా చూసుకోవాలనే కోరిక ఉండేది. ఇదే విషయాన్ని ఎప్పుడూ తన స్నేహితులతో ప్రస్తావించేవారు.ఎప్పటికైనా తను ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అందుకు కథలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ కరోనా మహమ్మారి అతని ప్రాణాలను బలి తీసుకుందని, తన కోరిక నెరవేరకుండానే మరణించారని ఆయన సన్నిహితులు తన మనసులో ఉన్న మాటను, తన కోరికను ఈ సందర్భంగా తెలియజేశారు.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -