Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్..

- Advertisement -

కరోనా స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సైతం అదే రాష్ట్రాల బాట పట్టింది. నేడు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి నిచ్చింది.

ఈ లాక్ డౌన్ 10 రోజుల పాటు కొనసాగనుంది. కోర్టు అడిగిన మేరకు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇటీవల కొద్దిమేర కరోనా కేసులు, మరణాలు తగ్గినా… ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని కొన్నిరోజుల పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రేపటి నుంచే లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కాసేపట్లో వెలువడనున్నాయి.

విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ ఏంటి రష్మిక?

కండీషన్లతో ఇంటికి చేరిన పుట్ట మధు..!

పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న పూజా హెగ్డే.. ఏ విషయంలో అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -