తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇక సినిమాలకు బైబై చెప్పేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలతో పాటు మరో ఒక సినిమా చేసి కోలీవుడ్‌కు దూరమవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గుర్రుగా ఉన్నారు. తనకున్న అభిమాన బలంతో రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు. అయితే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి మరో సినిమా చేసి రజనీ వచ్చేటట్టు ఉన్నారు.
ప్రస్తుతం రజనీ నటించిన కాలా సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఆ తర్వాత 2.0 సినిమా పూర్తయ్యే దశలో ఉంది. ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నాటికి ఓ సందేశాత్మక సినిమాతో వచ్చి ప్రజల్లో మెప్పు పొంది రాజకీయాంగా లబ్ధి పొందాలని రజనీ ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఓ సినిమాను కథా చర్చల్లో ఉన్నారు. చాలా మంది దర్శకులతో, నిర్మాతలు చర్చలు చేస్తున్నారు. ఇటీవల రజినీకాంత్ కొన్ని కథలను కూడా విన్నారు.
సూపర్ హిట్ దర్శకులు కార్తీక్ సుబ్బరాజు – అట్లీ అండ్ అరుణ్‌కుమార్ వంటి వారితో సందేశాత్మక కథలు వినిపించారంట. రజనీకి రెండూ నచ్చాయి. మరీ వీరిలో ఎవరి సినిమాలో నటిస్తారో చూడాలి. ఆయన ఒకే చెబితే భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించడానికి నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమాను నవంబర్, డిసెంబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లి 2019 సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశ ఉంది. ఈ విధంగా రజనీకాంత్ సినిమాలకు బైబై చెబుతూ కూడా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు.