Sunday, April 28, 2024
- Advertisement -

బీజేపీ టార్గెట్ 400 సీట్లు?

- Advertisement -

ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల చర్చ దేశ వ్యాప్తంగా సాగుతోంది. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో రూలింగ్ లో ఉన్న బీజేపీకి కళ్ళెం వేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తుంటే.. ఈసారి కూడా గుజరాత్ లో తిరిగి అధికారం చేపట్టి తమ బలం చాటుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తిసున్న ప్రధాన పార్టీల నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ పోలిటికల్ హిట్ ను పెంచుతున్నారు. ప్రస్తుతం గుజరాత్ ప్రజల్లో ఏర్పడ్డ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. తాజాగా భావ్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు..

కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తోందని, ఆ కారణంగానే ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి దించేశారని మోడి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడూ బాంబు పేలుళ్లు సర్వసాధారణంగా ఉండేవని, దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారని మోడీ హస్తం పార్టీపై విమర్శలు చేశారు. ఇదిలా ఉంచితే ఒక స్టెప్ ముందుకేసి అసోం సి‌ఎం హిమంత బిశ్వాశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ హిట్ ను మరింత పెంచాయి. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేసిందని అందుకే మనదేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచి వేసిందని చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం జరగబోతున్న గుజరాత్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ దే గెలుపని, ఈ ఎన్నికలు 2024 లో వచ్చే లోక్ సభ ఎన్నికలకు ప్రాక్టీస్ లాంటివని హిమంత బిశ్వా శర్మా చెప్పుకొచ్చారు. ఇక ఈసారి 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కార్ పై ఎంతో కొంత సానుకూలత గట్టిగానే ఉంది. ఇలాంటి తరుణంలో 400 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదని కొందరి అభిప్రాయం. అయితే రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ కు మంచి బుస్టప్ వస్తున్న నేపథ్యంలో బీజేపీకి సీట్లు భారీగా తగ్గి కాంగ్రెస్ కు పెరిగే అవకాశం ఉందని మరికొందరి అభిప్రాయం. మరి ప్రస్తుతం గుజరాత్ లోనూ అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మద్య ఈసారి గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రత్యర్థులపై కే‌సి‌ఆర్ టార్గెట్ !

కాంగ్రెస్ కే ఎందుకు ఈ అగ్ని పరీక్ష!

జగన్ ట్విస్ట్ లు, బాబు ప్లాన్లు.. హిట్ పెంచుతోన్న వ్యూహాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -