Thursday, May 2, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ రహస్య వ్యూహం.. అదే అంటున్న బీజేపీ !

- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కడుపుతున్నాయి. ఎలాగైనా ఈసారి విజయం సాధించి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు భావిస్తుంటే.. ముచ్చటగా మూడవ సారి అధికారాన్ని నిలుపుకోవని టి‌ఆర్‌ఎస్ చూస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మద్య నువ్వా నేనా అన్నట్లుగా ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ గత ఎన్నికల్లో మాదిరి ఈసారి కూడా ముందస్తూ ఎన్నికలకు వెలతారని గత కొన్నాళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పుకోచ్స్తున్నాయి అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం లేదని, ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కే‌సి‌ఆర్ చాలాసార్లు స్పష్టం చేశారు. .

అయినప్పటికి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కే‌సి‌ఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్నాటక ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించే ఉందని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి ఈ ముందస్తు ఎన్నికల చర్చ తెలంగాణలో హిట్ పించుతోంది. అయితే ఎలాంటి ముందస్తు ఎన్నికలు ఉండబోవని కే‌సి‌ఆర్ చెబుతున్నప్పటికి.. బీజేపీ శ్రేణులు మాత్రం కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెలతారని బల్లగుద్ది చెబుతున్నారు.

అయితే బీజేపీ శ్రేణులు ఇలా చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే కే‌సి‌ఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కని విధంగా ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలు ఒకటి తాలిస్తే.. తాను మరోటి అమలు చేసి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడం కే‌సి‌ఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని చెబుతున్నప్పటికి బీజేపీ నమ్మడంలేదు. డిఫెన్స్ లో పడేసేందుకే కే‌సి‌ఆర్ అలా చెబుతున్నారని, అసలు కే‌సి‌ఆర్ రహస్య వ్యూహం ముందస్తు ఎన్నికలేనని కాషాయ దళంలో వినిపిస్తున్న మాట. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉన్నమంటూ కాషాయనేతలు చెప్పుకొస్తున్నారు. మరి సంచలన నిర్ణయాలకు మారు పేరుగా ఉన్న కే‌సి‌ఆర్ గతంలో మాదిరి ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళతారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బీజేపీకి 400 సీట్లు.. పక్కా ?

లోకేశ్ పాదయాత్ర.. వైసీపీ నేతలు ఫుల్ ఖుషీ !

నా యుద్దం నేనే చేస్తా : పవన్ కల్యాణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -