Friday, May 3, 2024
- Advertisement -

త్రీ క్యాపిటల్స్ స్వలాభమా.. ప్రజా లాభమా!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ త్రీ క్యాపిటల్స్ విధానంపై ఒక్క జగన్ సర్కార్ మినహా.. మిగిలిన రాజకీయ పార్టీలు, ఆయా సంస్థలు, ఏపీ ప్రజానీకం, చివరికి హైకోర్టు నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. అయినప్పటికి మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. అయితే ఈ త్రీ క్యాపిటల్స్ విషయంలో ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా ఏ మాత్రం వెనక్కి తగ్గిన మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. .

అందుకే తమ ఎజెండా త్రీ క్యాపిటల్స్ అని బల్ల గుద్ది చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక మూడు రాజధానులు వెంటనే అమలు చేసే సీన్ లేకపోవడంతో విశాఖ నుంచి పరిపాలన సాగించి ఆ తరువాత త్రీ క్యాపిటల్స్ అమలు చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే ఎక్కడ లేని ఈ విధంగా ఈ త్రీ క్యాపిటల్స్ అమలు చేయడం వల్ల ఎవరికి లాభం అనేదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ మూడు రాజధానుల వల్ల ప్రజలకు ఎంతవరకు లాభం చేకూరుతుందో లేదో తెలియదు గాని, వైసీపీ స్వలాభామే అధికంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈసారి 175 స్థానాలలో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్న జగన్.. ఆ టార్గెట్ రిచ్ కావాలంటే మూడు ప్రాంతాల ప్రజల దృష్టి తమవైపు తప్పుకోవాల్సి ఉంటుంది.

అందుకే ఉత్తరాంధ్ర ను ఆకర్శించేందుకు విశాఖను కార్యనిర్వహణ రాజధానిగాను, రాయలసీమ ప్రాంత ప్రజలను ఆకర్శించేందుకు కర్నూల్ ను జ్యుడీషియల్ క్యాపిటల్ గాను, అలాగే అమరావతి ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టారు జగన్. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అన్నీ ప్రాంతాల ప్రజల మద్దతు వైసీపీకే లభించి 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయొచ్చనేది వైసీపీ అంచనా. దీంతో వైసీపీ స్వలాభం తప్పా.. ఇంకోటి లేదనేది చాలా మంది వాదన. అందుకే వైసీపీ ప్రణాళిక ఏపీ ప్రజానీకానికి కూడా అర్థం కావడంతో.. జగన్ సర్కార్ ప్రతిపాదిస్తున్న ఈ త్రీ క్యాపిటర్స్ పై పెద్దగా సానుకూలత చూపడం లేదు. అయితే ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో ఈలోగా త్రీ క్యాపిటల్స్ ను అమలు చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ అమలు కాకపోతే ఈ త్రీ క్యాపిటల్స్ ప్రతిపాదన వల్లే వైసీపీ డిఫెన్స్ లో పడే ప్రమాదం ఉంది. మరి వైఎస్ జగన్ ఏం చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

పని మనిషిపై లోకేశ్ అఘాయిత్యం : విజయసాయి రెడ్డి !

ఏపీలో కాంగ్రెస్ కు పునర్జీవం !

బీజేపీ సినీ మంత్రం.. ఎందుకోమరి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -