Tuesday, April 30, 2024
- Advertisement -

టీడీపీ విషయంలో బీజేపీ మెలిక..పవన్ కు ఇబ్బందే?

- Advertisement -

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలు టీడీపీ, జనసేన, వైసీపీ అన్నీ పార్టీలకు కూడా కీలకమనే చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా 151 సీట్లు కైవసం చేసుకున్నా వైసీపీ.. ఈసారి మాత్రం అంతకు మించి అంటోంది. ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుండా 175 స్థానాలలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఇక టీడీపీ ఈసారి గెలవకపోతే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ రెండు పార్టీలతో పాటు జనసేనకు కూడా ఈ ఎన్నికలు చాలా ముఖ్యం.. పార్టీ స్థాపించి పదేళ్ళు గడుస్తున్న ఇంతవరకు .. సంస్తగతంగా బలమైన పార్టీగా గుర్తింపు పొందలేదు.

దాంతో ఈ సారి ఎలాగైనా పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే ఎన్నికల్లో కనీసం పది సీట్లు అయిన కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పొత్తులకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే ప్రత్యేక్షంగా బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. పరోక్షంగా టీడీపీతో కూడా పొత్తుకు సిద్దంగా ఉన్నారు. టీడీపీ జనసేన పొత్తు అధికారికం కాకపోయినప్పటికి.. ఈ రెండు పార్టీల మద్య కచ్చితంగా పొత్తు ఉండే అవకాశం ఉందనే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వమని ఘంటాపథంగా చెప్తున్నా పవన్.. 2014 కూటమి రిపీట్ చేయాలని చూస్తున్నారు.

అయితే ఇక్కడున్న అసలు సమస్య టీడీపీ తో బీజేపీ కలిసేందుకు సిద్దంగా లేకపోవడమే. దాంతో టీడీపీ- బీజేపీని కలిపే బాద్యత పవన్ తీసుకున్నాట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు పార్టీల కూటమి విషయమై డిల్లీ పెద్దలతో పవన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ కొన్ని షరతుల మేర కూటమికి ఒప్పుకునేందుకు సిద్దంగా ఉందట. ఆ షరతులు ఏమిటంటే.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉండాలని.. మిగిలిన రెండున్నర ఏళ్ళు బీజేపీ అభ్యర్థికి అవకాశం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందట. ఈ షరతుకు టీడీపీ ఒప్పుకుంటే 2014 సీన్ రిపీట్ చేసేందుకు బీజేపీకి అభ్యంతరం లేదట. అయితే బీజేపీ పెట్టిన షరతు పవన్ కు కూడా కాస్త ఇబ్బంది కలిగించే విషయమే.. ఎందుకంటే పవన్ కూడా సి‌ఎం రేస్ లో ఉండడంతో బీజేపీ పెట్టిన షరతుకు పవన్ అంగీకరించే ప్రసక్తే లేదు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ మద్య జరుగుతున్నా అంతర్మదన చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయనేది ఒక ప్రశ్న అయితే అసలు ఈ మూడు పార్టీల మద్య సయోద్య కుదురుతుందా ? అనేది మరో ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

టీడీపీ కొత్త బాస్..బాబు వ్యూహమేంటి ?

బాబు ప్లానంత.. లోకేశ్ కోసమే !

గవర్నర్లు వర్సస్ ముఖ్యమంత్రులు.. అసలేంది ఈ రచ్చ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -