Saturday, April 27, 2024
- Advertisement -

లిక్కర్ స్కామ్.. మెయిన్ కవితనే : ఈడీ రిపోర్ట్స్ !

- Advertisement -

తెలంగాణలో ఈ మద్య డిల్లీ లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ స్కామ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రధానంగా వినిపించింది. అలాగే అలాగే ఈడీ నివేదికలలో కూడా కవిత పేరే హైలెట్ అయింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో లిక్కర్ రాజకీయం వేడెక్కింది. గత కొన్నాళ్లుగా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తున్న కమలనాథులు.. ఈ లిక్కర్ స్కామ్ ను హైలెట్ చేస్తూ కే‌సి‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. .

లిక్కర్ స్కామ్ లో మెయిన్ కవితనే అని, ఆమె కచ్చితంగా జైలుకు వెళ్ళడం ఖాయమని తీవ్ర విమర్శలు గుప్పించింది కాషాయ పార్టీ.. అందుకు తగ్గట్టుగానే కవితకు లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు కూడా జారీ చేయడం.. ఆమె విచారణకు హాజరుకావడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఇక తాజాగా ఎంఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జి షీట్ లో కవిత పేరు ప్రధానంగా 28 సార్లు ప్రస్తావించబడినట్లు తెలుస్తోంది. డిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి యజమాన్యంగా కల్వకుంట్ల కవితనే వ్యవహరించారని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది.

శరత్ రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి వంటి వారితో కలిసి కవిత ఈ లిక్కర్ వ్యాపారాన్ని సాగించైనట్లు ఈడీ తాజా చార్జ్ షీట్ లో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే కవిత చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ ఈడీ కేసులన్నీ మోడి సర్కార్ చేస్తున్న కుట్ర అని కవిత మరియు బి‌ఆర్‌ఎస్ నేతలు పదే పదే చెబుతున్నప్పటికి ఆమె చుట్టూ లిక్కర్ ఉచ్చు మరింత బిగుస్తుండడం గమనార్హం. ఇక కవిత జైలు కు వెల్లడమే తరువాయి అంటూ కాషాయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. మరి మొత్తానికి ఈడీ పేర్కొన్న తాజా చార్జ్ షీట్ తెలంగాణలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి దీనిపై కవిత, కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

నా బొచ్చు ఇస్తా : బండి సంజయ్ కి కే‌టి‌ఆర్ స్ట్రాంగ్ కౌంటర్ !

ఎన్నికల బరిలో జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు వ్యూహం అదే !

మల్లారెడ్డి రాజకీయం.. బి‌ఆర్‌ఎస్ కు తలనొప్పే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -