Saturday, May 11, 2024
- Advertisement -

హీరో రామ్ చిన్నారిని పట్టుకుని కంటతడిపెట్టాడు!

- Advertisement -

కొంతా కాలంగా సరైనా హిట్ లేని రామ్ కి నేను శైలజ అనే సినిమా తో మంచి హిట్ వచ్చింది. అయితే రామ్ ఓ చిన్నారి కోరిక చూసి కంటతడి పెట్టాడు. అసలు విషయంలో కి వెళ్తే… విశాఖ లోని ఎంవీపీకాలనీ లో ఉండే రవికుమార్ రెండో కుమార్తె కుందన పూర్ణచంద్రిక (5) పుట్టుకతోనే నడుము కింద భాగం చచ్చుబడిపోయింది.

దీంతో తనతోటి పిల్లలు హాయిగా కేరింతలు కొడుతూ ఆటలాడుకుంటుంటే, పాపం చంద్రిక మాత్రం అడుగు కూడ కదపలేని స్థితి లో ఉంది. చిన్నారిని చూస్తూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే ఆ చిన్నారికి హీరో రామ్ అంటే చాలా ఇష్టం. రామ్ డాన్స్ లు, చిత్రాలు చూస్తూ అనందపడుతుందట. ఓ రోజు రామ్‌ను చూసే అవకాశం చిన్నారికి వచ్చింది. అప్పటి నుంచి రామ్‌ను పదేపదే చూడాలన్న కోరిక చిన్నారి మదిలో బలంగా నాటుకుపోయింది. అయితే ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమా హైపర్.

ఈ సినిమా షూటింగ్ కోసం రామ్ వైజాగ్ కి వచ్చారు. దాంతో ఆ చిన్నారి కోరిక తీరింది. శుక్రవారం సాయంత్రం రామ్ చిన్నారిని కలిసేందుకు వచ్చాడు. ఎంవీపీకాలనీలో వారి ఇంటికి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించాడు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. కుందన దుస్థితి చూసి రామ్ చిన్నారిని పట్టుకుని కంటతడిపెట్టాడు. రామ్ ను చూస్తూ చంద్రిక ఎంతో సంతోష పడింది.

Related

  1. రామ్ ‘హైపర్’ ఫస్ట్ లుక్ ఎలా ఉంది అంటే?
  2. రామ్ చరణ్ ధృవ రిలీజ్ డేట్!
  3. హీరో రామ్ ఏలాంటి పాత్ర చేయబోతున్నాడో తెలుసా?
  4. రామ్ చరణ్ కి అడ్డం పడుతున్న చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -