Friday, March 29, 2024
- Advertisement -

రామ్ పోతినేని న్యూ మూవీ షూటింగ్ షురూ..!

- Advertisement -

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, రెడ్ చిత్రాలతో హిట్ అందుకున్నాడు. ఇవాళ రామ్ హీరోగా మరో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రన్, పందెంకోడి, ఆవారా వంటి మాస్ చిత్రాలను తెరకెక్కించిన కోలీవుడ్ డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ గానీ ఈ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభమయ్యింది.

ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో రామ్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ డ్యుయల్ షెడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో రామ్ పోలీస్ అధికారిగా, డాక్టర్ గా కనిపిస్తారని తెలుస్తోంది.

ముందు వైద్యుడిగా రోగులకు వైద్య సేవలు చేసే రామ్, ఆ తర్వాత పోలీస్ అధికారిగా మారి సమాజానికి పట్టిన చీడను ఎలా వదిలించాడు.. అనే స్టోరీలైన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరులో కానీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో కానీ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకోసం రామ్ రూ.15 కోట్లు పారితోషికం అందుకుంటున్న ట్లు సమాచారం.

Also Read

చైతూ, నాని సినిమాల విడుదల ఎప్పుడంటే..!

మాట తప్పిన కాజల్​.. ప్రభాస్​ కోసమేనా?

టాప్ గేర్ లో దూసుకెళ్తున్న కృతి శెట్టికి బాలీవుడ్ ఆఫర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -