చైతూ, నాని సినిమాల విడుదల ఎప్పుడంటే..!

- Advertisement -

కరోనా వ్యాప్తి కారణంగా మూసివేసిన థియేటర్లు ఈ నెలాఖరున మళ్లీ తెరుచుకున్నాయి. నారప్ప, ఖిలాడి, విరాటపర్వం, సీటీమార్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ముందస్తు బెర్త్ మాత్రం నాగచైతన్య, నాని రిజర్వ్ చేసుకున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ ఆగస్టు 7న విడుదల అవుతుండగా, నాని హీరోగా నటించిన టక్ జగదీష్ ఆగస్టు 13వ తేదీ థియేటర్లలోకి రానుంది.

సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ప్రేమకథా చిత్రాలను తీర్చిదిద్దడంలో శేఖర్ కమ్ముల ఎంతో ఎక్స్ ఫర్ట్. ఆయన గత చిత్రం ఫిదా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట సంచలన విజయం అందుకుంది.

- Advertisement -

ఇక న్యాచురల్ స్టార్ నాని- శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నుకోరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరోసారి ఈ కాంబోలో సినిమా రానుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చాలా రోజుల తర్వాత ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం విడుదలైన సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ సినిమా సూపర్ హిట్ కాగా ఈసారి సెకండ్ వేవ్ తర్వాత లవ్ స్టోరీ ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

Also Read

అల్లు వారబ్బాయి మెడకు ఏమైయింది..!

‘స్టాండప్ రాహుల్ ‘ రాజ్ తరుణ్ ను గట్టెక్కిస్తుందా..!

మళ్లీ సెట్స్ పైకి వచ్చిన మాస్ మహారాజా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -