Saturday, April 27, 2024
- Advertisement -

‘మహా సముద్రం’నుంచి రావు రమేష్.. గూని బాబ్జీ లుక్ రిలీజ్

- Advertisement -

విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయన నటిస్తోన్న ‘మ‌హాస‌ముద్రం’ చిత్రంలోని లుక్‌ని చిత్రయూనిట్ మంగళవారం విడుదల చేసింది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ హీరోగా తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమా లో రావు రమేష్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో రావు రమేష్ గూని బాబ్జి పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలలో రావు రమేష్ త‌న‌దైన న‌ట‌న‌తో పూర్తి న్యాయం చేస్తారని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఈ చిత్రంలో కూడా ఆయన నటన అద్భుతంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు లుక్స్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

‘కేజీఎఫ్ 2’లో రావు రమేష్ లుక్ రిలీజ్!

గుండె దమ్ము అంటూ.. హల్చల్ చేసిన అలీ రెజా!

‘ముగ్గురు మొనగాళ్లు’ ట్రైలర్ విడుదల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -