Friday, March 29, 2024
- Advertisement -

రవితేజ​- త్రినాథరావు మూవీ ఉంటుందా? ఉండదా? ఇదిగో క్లారిటీ..!

- Advertisement -

పీపుల్ మీడియా బ్యానర్ పై రవితేజ దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్​లో ఓ సినిమా రాబోతుందని గతంలో టాక్​ నడిచింది. అయితే కొంత కాలం తర్వాత వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అంతేకాక.. ఇదే కథను దర్శకుడు త్రినాథరావు .. వరుణ్​తేజ్​ కు వినిపించాడని .. కథ అతడికి నచ్చిందని ఈ సినిమా వరుణ్​- త్రినాథరావు కాంబినేషన్​లో రాబోతుందని వార్తలు వచ్చాయి. దీంతో రవితేజ మూవీ ఆగిపోయిందని భావించారంతా? కానీ ఇప్పుడు ఓ ట్విస్ట్ ఇచ్చింది పీపుల్​ మీడియ బ్యానర్​.

‘ రవితేజ – త్రినాథరావు కాంబోలో మూవీ ఆగిపోలేదు. అది తెరకెక్కబోతున్నది. త్రినాథరావు.. వరుణ్​ తేజ్​తో నూ మరో సినిమాను తీయబోతున్నాడు. ఆ మూవీకి .. ఈ మూవీకి ఏ విధమైన సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది పీపుల్​ మీడియా బ్యానర్​ . దీంతో రూమర్స్​కు చెక్​ పడింది. అయితే రవితేజకు గతంలో రెమ్యునరేషన్​ విషయంలో తేడా కొట్టి ఈ మూవీని వద్దనుకున్నాడట. ప్రస్తుతం అంతా సెట్​ కావడంతో ఓకే చెప్పాడట మాస్​ మహారాజ.

త్రినాథరావు గతంలో నేను లోకల్​, సినిమా చూపిస్త మావ వంటి చిత్రాలను తెరక్కెంచాడు. కామెడీ సీక్వెన్స్​ తీయడంలో త్రినాథరావుది అందెవేసిన చెయి.. కానీ అప్పుడప్పుడు సీరియస్​ సబ్జెక్టు చేసి చేతులు కాల్చుకుంటూ ఉంటాడు. మొత్తానికి త్రినాథరావు – రవితేజతో కాంబోలో వచ్చేది. కామెడీ సబ్జెక్టా. సీరియస్​ సబ్జెక్టా అనేది వేచి చూడాలి.

Also Read

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -