Friday, March 29, 2024
- Advertisement -

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

- Advertisement -

మ‌న ముఖంపై ఉండే చిరునవ్వే చెబుతుంది మనమెంత సంతోషంగా ఉన్నామనేది. ఆ చిరునవ్వుకు తోడు మెరిసిపోయే దంతాలు మీ సంతోషాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అయితే చాలా మంది పసుపు రంగులో ఉన్న దంతాలతో ఇబ్బంది పడిపోతుంటారు. మనస్ఫూర్తిగా కూడా నవ్వలేకపోతుంటారు. అయితే దంతాలు పసుపురంగులోకి మారడానికి ఎన్నో కారణాలున్నాయి.

రోజూ దంతాలను ఎంతో శుభ్రంగా ఉంచుకున్నా.. పసుపు రంగులో ఉంటే.. ఈ కింది చిట్కాలను ట్రై చేయండి. రోజ్ వుడ్ నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెను దంతాలకు రాయడం వల్ల పళ్లపై ఉన్న పసుపు రంగు మాయం అవుతుంది. ఇవే కాకుండా కొబ్బరి నూనె పసుపు రంగుకు చెక్ పెడుతుంది. ఇకపోతే.. బేకింగ్ సోడా కూడా దంతాలను క్లీన్ గా ఉంచడంలో ముందుంటుంది.

దీనిని వాడటం వల్ల నోట్లో బ్యాక్టిరియా పెరగకుండా చేస్తుంది. రెండు టీస్పూన్ల నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాని మిక్స్ చేయాలి. దీంతో బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా ట్రై చేస్తే మీ పళ్లు దగదగా మెరిసిపోతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వీటితో పాటుగా మీరు తీసుకునే ఆహారంలో కాల్షియం మిస్ అవ్వకుండా చూడండి. కాల్షియం లేకపోవడం వల్లే పళ్లు పసుపు రంగులోకి మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

సాగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థి ఆయనే..

రంగుల కేళీ.. సంబురాల హోలీ !

అభినవ ఉసేన్ బోల్ట్‌.. కంబ‌ళ వీరుడి స‌రికొత్త రికార్డు !

మ‌ణిశ‌ర్మ బీటూ.. చిరు స్టెప్పూ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -